తెలంగాణా రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, రామాదుగు మండలం, గుండి గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం అనేది కొన్ని వందల సంవత్సరాల చారిత్రక సంపద కలిగిన ప్రసిద్ధి గల దేవాలయం. చాళుక్య నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ దేవాలయం, గ్రామానికి మాత్రమే కాదు, పరిసర ప్రాంతాల భక్తులకూ అత్యంత పవిత్ర స్థానం. ఈ దేవాలయం ఇప్పటికీ నిత్యపూజా కైంకర్యాలతో, భక్తులకు దైవానుభూతిని కల్పిస్తూ కొనసాగుతోంది. ఈ దేవాలయంలో ప్రధాన ఉత్సవాలు శ్రీకృష్ణాష్టమి, శ్రావణ బహుళ ఏకాదశి నాడు స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవం, విజయదశమి రోజున గ్రామ వీధులలో స్వామివారి గరుడాల్వార్ వాహన సేవలుగా నిర్వహించబడుతున్నాయి. ఈ దేవాలయంలో శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరుక్మిణి సత్యభామల సమేతుడై సంతాన వేణుగోపాలస్వామిగా దర్శనమిచ్చి, భక్తులందరి కోరికలను నెరవేర్చుచున్నాడు. అలాగే స్వామివారి వాహనసేవకు నిరంతరం సిద్ధంగా ఉన్నట్లు, స్వామివారి కుడి వైపున ఆంజనేయుడు, ఎడమ వైపున గరుత్మంతుడు ప్రతిష్టించబడి ఉండడం ఈ దేవాలయ ప్రత్యేకత. అంతేకాకుండా రామానుజాచార్యులు మరియు ఇతర ఆళ్వారులు అందరూ స్వామివారి సన్నిధిలో కొలువై ఉన్నారు. సంవత్సరాలలో ముఖ్య పర్వదినాలలో ఉగాది, తొలి ఏకాదశి, శ్రీ అహండలు తిరు నక్షత్రం, ముక్కోటి ఏకాదశి లాంటి రోజుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వాహించబడుతాయి. శ్రీకృష్ణ పరమాత్మ చే సంహరించబడిన నరకాసుర వద సందర్భంగా జరుపుకునే దీపావళి పండుగ రోజున దేవాలయంలో నిర్వహించబడే సహస్ర దీపోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఈ సంవత్సరం మొదటిసారిగా దేవాలయ ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు – 2025 నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా దేవాలయ నుంచి కరపత్రం విడుదల చేయడం జరిగింది.

Comments

Popular Posts